బసంతి ఆస్తులు రూ. 278 కోట్లు! మథుర నుంచి రంగంలోకి 

సినీ నటి హేమమాలిని బీజేపీ తరపున మూడోసారి మథుర స్థానం నుంచి నామినేషన్​ను దాఖలు చేశారు. నామినేషన్​లో పేర్కొన్న ప్రకారం ఆమె ఆస్తుల విలువ శనివారం వెలుగులోకొచ్చింది.  

Apr 6, 2024 - 17:44
 0
బసంతి ఆస్తులు రూ. 278 కోట్లు! మథుర నుంచి రంగంలోకి 

లక్నో: సినీ నటి హేమమాలిని బీజేపీ తరపున మూడోసారి మథుర స్థానం నుంచి నామినేషన్​ను దాఖలు చేశారు. నామినేషన్​లో పేర్కొన్న ప్రకారం ఆమె ఆస్తుల విలువ శనివారం వెలుగులోకొచ్చింది.  తన ఆస్తుల విలువ రూ. 278 కోట్లుగా నామినేషన్​లో ప్రకటించింది. రూ. 67.7 లక్షల నగదు, రూ. 69.6 లక్షల కారు, రూ. 4.4 కోట్ల నగలు, రూ. 249 కోట్ల ఇళ్లు, భూములు ఉన్నట్లు వెల్లడించింది. 2014లో రూ. 178 కోట్లు, 2019లో 250 కోట్లు, 2024లో 278 కోట్లుగా ఆమె ఆస్తులు పెరుగుతూ వచ్చాయి. పదేళ్లలో హేమామాలిని ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది. కాగా సినీ రంగంలో హేమమాలిని 162పైగా చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సాధించారు. 1975లో వచ్చిన షోలే సినిమాతో ఆ సినిమాలోని పాత్ర పేరు బసంతి పాత్రకు ప్రాచుర్యం లభించింది. అప్పటి నుంచి ఆమె అభిమానులు ఆమెను ముద్దుగా బసంతిగానే పిలుచుకోవడం విశేషం.