నైనిటాల్​ లో మళ్లీ రాజేసుకున్న అగ్గి

ఉత్తరాఖండ్​ నైనిటాల్​ పర్యాటక ప్రాంతంలో మళ్లీ అగ్గి రాజేసుకుంది. గురువారం అర్థరాత్రి నుంచి కొనసాగుతున్న మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

May 4, 2024 - 14:22
 0
నైనిటాల్​ లో మళ్లీ రాజేసుకున్న అగ్గి

నైనిటాల్​: ఉత్తరాఖండ్​ నైనిటాల్​ పర్యాటక ప్రాంతంలో మళ్లీ అగ్గి రాజేసుకుంది. గురువారం అర్థరాత్రి నుంచి కొనసాగుతున్న మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. శనివారం వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది,అధికారులు ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు ఆరడం లేదు. నైనిటాల్ జిల్లా ధారి, మతియాల్, పదంపూరి, ఖుర్పతాల్, దేవిధుర అడవులలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆదాయాన్ని సమకూర్చే భారీ మొక్కలు సైతం కాలిబూడిదయ్యాయి. ఓక్​, ఫైన్​, దేవదారు చెట్లు భారీగా దగ్ధం కావడంతో నష్టం భారీగానే వాటిల్లిందని అటవీశాఖాధికారి గోవింద్​ గున్వంత్​ తెలిపారు. మరోవైపు ముక్తేశ్వర్, రామ్‌గఢ్, ధనచూలిలో చెలరేగిన మంటలను అటవీ శాఖ, గ్రామస్తులు శ్రమించి ఆర్పివేశారు. బేతాళఘాట్‌లోని కోసి రేంజ్‌ అడవుల్లో చెలరేగిన మంటలు శుక్రవారం మధ్యాహ్నం బర్గల్‌ అటవీప్రాంతానికి వ్యాపించాయి. సాయంత్రం వరకు అడవిలో మంటలు ఆరలేదు. 
రెండు రోజులుగా మంటలను ఆర్పేందుకు అటవీశాఖ డీఎఫ్​ వో చంద్రశేఖర్​ జోషి నేతృత్వంలోని 28 మంది ట్రైనీలతో కలిసి నిర్విరామంగా పనిచేస్తున్నారు. మంటలు ఆరినట్లే ఆరి కొద్ది గంటలకే వేరే చోట మొదలవుతుండడంతో అటవీశాఖాధికారులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.