జమ్మూకశ్మీర్ అభ్యర్థుల ప్రకటన?
ప్రధాని నేతృత్వంలో బీజేపీ ఉన్నతస్థాయి సమావేశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించనుంది. ఈ మేరకు ఆదివారం రాత్రి ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జీ, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, సుధా యాదవ్, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, సత్యన్ జాతియా, సర్బానంద సోన్‌వాల్, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా లు హాజరయ్యారు. విస్తృతస్థాయి సమావేశం నిర్వహణ సందర్భంగా అభ్యర్థుల పేర్లు అర్థరాత్రి ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. తొలివిడతలో 24 స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించనున్నారు. గులాంనబీ పార్టీ (డీపీఏపీ) 13 మంది అభ్యర్థుల లిస్టును విడుదల చేయగా, ఆప్ ఏడుగురి లిస్టును విడుదల చేసింది.