అంతరిక్షం నుంచి సురక్షితంగా వైజ్ఞానికులు వివరాలు వెల్లడించిన నాసా వర్గాలు

అంతరిక్ష యాత్ర చేపట్టిన ముగ్గురు రష్యన్​ వైజ్ఞానికులు శనివారం సురక్షితంగా భూమిపైకి వచ్చారు. అంతరిక్ష క్యాప్సూల్​ లో వీరంతా సురక్షితంగా కజకిస్తాన్​కు చేరుకున్నట్లుగా నాసా అధికార వర్గాలు ప్రకటించాయి.

Apr 6, 2024 - 18:23
 0
అంతరిక్షం నుంచి సురక్షితంగా వైజ్ఞానికులు వివరాలు వెల్లడించిన నాసా వర్గాలు

న్యూఢిల్లీ: అంతరిక్ష యాత్ర చేపట్టిన ముగ్గురు రష్యన్​ వైజ్ఞానికులు శనివారం సురక్షితంగా భూమిపైకి వచ్చారు. అంతరిక్ష క్యాప్సూల్​ లో వీరంతా సురక్షితంగా కజకిస్తాన్​కు చేరుకున్నట్లుగా నాసా అధికార వర్గాలు ప్రకటించాయి. అంతరిక్ష యాత్ర చేపట్టిన వారిలో మహిళలు కూడా ఉన్నారని వెల్లడించారు. 2023 సెప్టెంబర్​ 15న ఈ వైజ్ఞానికులు హారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారని నాసా వెల్లడించింది. 204రోజులు అక్కడే గడిపారని తెలిపింది. సోయూజ్​ఎంఎస్​–24 క్యాప్సూల్​లో వ్యోమగాములు కజికిస్తాన్​లో మధ్యాహ్నం 12 గంటలకు దిగినట్లు నాసా పేర్కొంది. ఓ వైపు ఉక్రెయిన్​తో సుధీర్ఘకాలంగా రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు తమ దేశ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకొని అంతరిక్ష యాత్రలు చేపడుతూ విజయం సాధిస్తుండడంతో పలువురు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.