హేమంత్ సోరెన్ కు బెయిల్ నిరాకరణ
Bail denial to Hemant Soren
రాంచీ: భూ కుంభకోణం కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు రాంచీ పీఎంఎల్ ఏ కోర్టు బెయిల్ ను నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్ శనివారం విచారించింది. తన మేనమామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 13 రోజుల మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈడీ సోరెన్ కు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. కేసు కీలక దశలో కొనసాగుతుందని పేర్కొంది. ఇరువురి తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు బెయిల్ ను ఇచ్చేందుకు నిరాకరించింది.