మోదీ సూ‘దూర’ దృష్టి

Modi's long-range vision

Sep 4, 2024 - 13:30
 0
మోదీ సూ‘దూర’ దృష్టి
భవిష్యత్తులో చమురు కొనుగోళ్లలో కీలకం
ఒప్పందాలతో చైనాకు చెక్​
శాటిలైట్​ శిక్షణతో ముందుకు
సుల్తాన్​ కు 500 రోల్స్​ రాయిస్​ లు!
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​:
భారత్​ కు బ్రూనై పర్యటన ఎందుకు అంత ముఖ్యం. భారత్​ నుంచి తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు వెళ్లినట్లు. కేవలం 4లక్షల జనాభా ఉన్న బోర్నియా భారత్​ కు 7, 486 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఎందుకు ప్రధాని నరేంద్ర మోదీ అంత్య ప్రాధాన్యతనిచ్చారు. ఈ దేశానికి ఒక వైపు దక్షిణ చైనా సముద్రం, మరోవైపు మలేషియాలు ఉన్నాయి. 
 
ప్రధాని మోదీ బ్రూనైకి ఎందుకు వెళ్లారు?
మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ రీసెర్చ్ విశ్లేషకుల ప్రకారం.. ఇటీవల వియత్నాం, మలేషియా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తైమూర్-లెస్టే సందర్శించి తిరిగి వచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటించారు. 
ఆగ్నేయాసియా ప్రాంతానికి భారతదేశం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో దీన్నిబట్టి తెలుస్తుంది. గత సంవత్సరం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈస్ట్ సౌరభ్ కుమార్ ఒక ప్రతినిధి బృందంతో బ్రూనై వెళ్లారు. ఇక్కడ విదేశాంగ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశం మరియు బ్రూనై తమ దౌత్య సంబంధాలు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని ఇరు దేశాల మధ్య నిర్ణయించబడింది. ఈ కారణంగానే ప్రధాని మోదీ బ్రూనై వెళ్లారు.
 
ఈ సందర్శన ప్రత్యేకత ఏంటీ? 
రక్షణ, వాణిజ్యం, ఇంధనం, అంతరిక్ష సాంకేతికత వంటి నాలుగు ముఖ్యమైన కారణాల వల్ల బ్రూనై భారతదేశానికి ప్రత్యేకమైనది. రష్​యా–ఉక్రెయిన్​ యుద్ధం. మరోవైపు ఇస్లామిక్​ దేశాల నుంచి చమురు కొనుగోళ్లు భారంగా మారడం, ఎర్రసముద్రంలో పైరెట్ల దాడులు ఇవన్నీ భారత్ కు ఆర్థికంగా పెనుభారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​ ముందే మేల్కొని బ్రూనైతో పలు ఒప్పందాలను చేసుకుంటే భవిష్యత్​ లో చమురు, గ్యాస్​ సరఫరాలో ఈ దేశం కీలకంగా మారనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ముందుచూపుతే వ్యవహరిస్తూ బ్రూనైతో సత్సంబంధాలను నెరపడంలో విజయం సాధించారు. మరోవైపు ఈ దేశానికి చైనా సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వల్ల బ్రూనైతో భవిష్యత్​ లో భారత్​ కు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని మోదీ మిత్రత్వాన్ని పటిష్టం చేసే దిశలో ముందుకు వెళ్లారు. అయితే చైనా–బ్రూనైల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఈ రెండు కూడా మిత్రత్వ దేశాలే. అదే సమయంలో ఫిలిప్పిన్స్​ విషయంలో చైనా దూకుడుగా వ్యవహరించడాన్ని బ్రూనై పలుమార్లు నిందించింది. ఇలాంటి విషయాలే భవిష్యత్​ లో చైనా–బ్రూనైల మధ్య కూడా వివాదాలకు దారితీస్తాయా? అనే అనుమానాలున్నాయి. చైనా ఇటీవల శ్రీలంక, బంగ్లా, పాక్​ లతో కలిసి భారత్​ ను ఇరకాటంలోకి నెట్టాలనే అనేక ప్రయత్నాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయత్నాలను ఓ వైపు అడ్డుకుంటూనే మరోవైపు యాక్ట్​ ఈస్ట్​ పాలసీ ద్వారా వివిధ దేశాలను ఏకతాటిపైకి తీసుకురాగలిగితే చైనాకు ఎకనామీ పరంగా చెక్​ పెట్టినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. 
 
శాటిలైట్స్​
బ్రూనైలో శాటిలైట్​ ట్రాకింగ్​ కోసం భారత్​ అనేక ప్రదేశాల్లో గ్రౌండ్​ స్టేషన్లను నిర్మించింది. వీటికి ఎలిమెంటరీ, శాటిలైట్​ కమాండ్​ స్టేషన్​ లు ఉన్నాయి. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో ఈ స్టేషన్ల పాత్ర కీలకంగా నిలుస్తోంది. అంతరిక్ష సాంకేతికతకు సంబంధించి బ్రూనై ప్రజలకు భారత్​ శిక్షణ అందజేస్తుంది. భారత్​ నుంచి ప్రయోగించిన శాటిలైట్లను పరిక్షించేందుకు భారత్​ వివిధ దేశాల్లో గ్రౌండ్​ స్టేషన్లను నియమించింది. ఇందులో బ్రూనై కూడా ఒకటి. 
 
భేష్​ ప్రధాని మోదీ దూరదృష్టి..
ఏది ఏమైనా ప్రధానమంత్రి మోదీ సూదూర దూరదృష్టితో దేశీయ అవసరాలు తీర్చడంతోపాటు శాంతి, సామరస్యాలను కాపాడుకుంటూ, అభివృద్ధి వైపు పయనిస్తూ ప్రపంచమంతా ఒకటే కుటుంబమని మాటల్లోనే గాక చేతల్లో కూడా చూపిస్తుండడంపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. 
 
బ్రూనై సుల్తాన్​ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు..

ఈ దేశానికి 1984లో స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి బ్రూనై సుల్తాన్​ హసనల్​ బోల్కియానే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచదేశాల్లో అత్యధిక సంపద ఉన్నవారిగా ఈయనే నిలవడం గమనార్హం. ఈయన సంపద 2లక్షల 35వేల కోట్ల రూపాయలు. నెలకు రెండుసార్లు కటింగ్​ చేసుకుంటారు. దానికయ్యే ఖర్చు రూ. 32 లక్షలు. క్షురకున్ని విదేశాల నుంచి ప్రైవేట్​ జెట్​ లో రప్పిస్తారు! సుల్తాన్​ కు 3వేల కోట్ల రూపాయలు గల ఒక బోయింగ్​ విమానం ఉంది. దీనికి బంగారు తాపడం, వాష్​ బేసిన్​ కిటీకీలు, వివిధ రకాల ఉపకరణాలను విమానంలో ఏర్పాటు చేసేందుకే రూ. 989 కోట్లు వెచ్చించడం విశేషం. ఈయన నివసిస్తున్నప్యాలెస్​ విలువ 50 బిలియన్లు. 800 కార్లు, ప్యాలెస్​ గోడలకు బంగారపు తాపడం వేయించారు. 20లక్షల చదరపు అడుగుల్లో ఇది నిర్మితమై ఉంది. ఈ ప్యాలెట్​ గిన్నిస్​ వరల్డ్​ రికార్డులో నమోదైంది.  ఈయన వద్ద 500 రోల్స్​ రాయిస్​ కార్లు ఉండడం విశేషం. 
 
ఈ దేశానికి సంపద చమురు బావుల ద్వారానే లభిస్తుంది. ఇక్కడ విద్య, వైద్యం ఉచితం. బ్రూనై జీడీపీ 1668.15 అమెరికన్​ డాలర్లు. సగానికి పైగా చమురు, గ్యాస్​ ద్వారానే సమకూరుతుంది. బ్రూనైలో ఒక వ్యక్తి తలసరి ఆదాయం భారత రూపాయల ప్రకారం రూ. 24.46 లక్షలు. అదే భారత్​ లో అయితే ఒక వ్యక్తి ఆదాయం రూ. 1 లక్షా 87వేలు.