సమయం కేటాయింపుపై మమత అవాస్తవం
నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎంకు ఇచ్చిన సమయంలో ఆమె అభిప్రాయాలను నీతి ఆయోగ్ కౌన్సిల్ ముందు ఉంచారని, సమయం కేటాయించలేదన్నది పూర్తి అవాస్తవమని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై వివరణ ఇచ్చారు. సీఎం మమత మధ్యాహ్నం లంచ్ తరువాత మాట్లాడాల్సి ఉందన్నారు. అయినా ఆమె విన్నపం మేరకు తొలుత అవకాశాన్ని ఆమెకే ఇచ్చామన్నారు. ఆమెకు 7 నిమిషాలు మాట్లాడే సమయం అందరిలానే కేటాయించామన్నారు. అనంతరం సమయం ముగిసినా ఆమె అదనపు సమయాన్ని కోరలేదన్నారు. దీంతో ఈ సమావేశంలో ఉన్న ఆటోమెటేడ్ మైక్ లు సమయానికి మించి అభ్యర్థన చేసుకోకుంటే కట్ అయిపోతాయని తెలిపారు. అనంతరం మమతా బెనర్జీ బయటికి వెళ్లిపోయారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇంతకుమించి సమావేశంలో ఏం జరగలేదని సీఈవో తెలిపారు. సమవేశంలో అనేక రాష్ట్రాలు సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నందున అందరికీ అంతే సమయం కేటాయించామని తెలిపారు. బిహార్ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున నితీశ్ హాజరు కాలేకపోయారని సుబ్రమణ్యం స్పష్టం చేశారు.