రాహుల్​ పర్యటనతో ఒరిగేదేం లేదు

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ 11 స్థానాల్లో బీజేపీ విజయం ఖాయం

Apr 27, 2024 - 15:30
 0
రాహుల్​ పర్యటనతో ఒరిగేదేం లేదు

డిస్ఫూర్​: రాహుల్​ పర్యటన వల్ల కాంగ్రెస్​ పార్టీకి ఒరిగేదేం లేదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసోంలో హిందువులైనా, ముస్లింలైనా బీజేపీకే అధికారం కట్టబెట్టనున్నారని తెలిపారు. 14 సీట్లకు గాను 11 సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అభివృద్ధి నినాదం అసోం ప్రజలను తీవ్రంగా ఆకర్షిస్తోందన్నారు. 

అసోం చాలా ప్రశాంతమైన రాష్ర్టమన్నారు. ఇక్కడ బీజేపీ హయాంలో నేరాలను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. అన్ని మతాల వారు సోదరభావంతో మెలగుతున్నారని తెలిపారు. 

ఆర్థిక పునర్విభజన చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని మండిపడ్డారు. తల్లిదండ్రుల ఆస్తులను పిల్లల నుంచి లాగేసుకుంటామని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇలాంటి చర్యలను తాము అడ్డుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్​ హయాంలో అసోం అభివృద్ధి చెందలేదని, ప్రశాంత వాతావరణం లేదని ప్రజలు అప్పటి నేటి పాలనను బేరీజు వేసుకోవాలని స్పష్టం చేశారు.