నైనిటాల్​ అడవుల్లో మంటలు

ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక శాఖ ఆర్మీ సహాయంతో రంగంలోకి హెలికాప్టర్​

Apr 27, 2024 - 15:26
 0
నైనిటాల్​ అడవుల్లో మంటలు

నైనిటాల్​: ఉత్తరాఖండ్​ నైనిటాల్​ సమీపంలోని భవాలి దుగై బర్మాటాప్​ అడవులకు మంటలంటుకున్నాయి. నైనిటాల్​ లోని నివాస ప్రాంతాలైన హైకోర్టు కాలనీకి సమీపంలోకి చేరడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం నుంచే మంటలంటుకున్నా, శనివారం వరకు కూడా ఏ మాత్రం తగ్గకపోవడంతో రక్షణ రంగ హెలికాప్టర్​ ను ఎం–17ను రంగంలోకి దింపారు. 

మంటలు అటవీ ప్రాంతం నుంచి బయటి ప్రాంతాలకు పాకకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు హెలికాప్టర్​ ద్వారా భారీ ఎత్తున నీటిని వెదజల్లుతున్నారు. ఎండలు మండిపోతుండడంతోనే మంటలు అంటుకొని ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఎండలకు తోడు భారీ ఎత్తున గాలులు వీస్తుండడం కూడా అటవీ ప్రాంతాల నుంచి మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని తెలిపారు. అందుకే ఆర్మీ సహాయం తీసుకున్నామని, త్వరలోనే మంటలను పూర్తిగా అదుపు చేస్తామని వివరించారు.

నైనిటాల్‌లోని లడియాకటా ఎయిర్ ఫోర్స్ కాలనీ, పైన్స్, గెథియా, బల్దియాఖాన్, మేషం, బారా పత్తర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద యెత్తున అగ్నిమాపక శకటాలను రంగంలోకి దింపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 34 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ సంపద దెబ్బతిన్నట్లు సమాచారం.