జమ్మూకశ్మీర్ లో ముగిసిన ఎన్నికలు
65 శాతం పోలింగ్ నమోదు విజయంపై అన్ని పార్టీల ధీమా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో చివరి విడత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 65 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారం ఏడు జిల్లాల్లో 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసీ ఎన్నికలను నిర్వహించింది. అత్యధికంగా ఉధంపూర్ లో 722.91 శాం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా బారాముల్లలో 55.73 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగిస్తున్నాయని పీడీపీ ఆరోపించింది. అదే సమయంలో ప్రజల గొంతుకై నిలుస్తామని అవామీ ఇత్తెహాద్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ ఇంజనీర్ రషీద్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీలు తమ విజయం తథ్యమని అన్నాయి.
ఇక ఈ రాష్ట్ర ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. మోదీ నేతృత్వంలో అభివృద్ధికే ప్రజలు ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు.
బందీపోరాలో 63.33 శాతం, జమ్మూలో 66.79 శాతం, కథువాలో 70.53 శాతం, కుప్వారాలో 62.76 శాతం, సాంబాలో 72.41 శాతం ఓటింగ్ నమోదైంది.