సీఎం తల్లిదండ్రుల విచారణ?
ముగియనున్న విభవ్ కస్టడీ గడువు సీఎం ఇంట్లోనే మహిళలకు రక్షణ లేదు: స్మృతిఇరానీ గురువు హజారేకు కేజ్రీ ద్రోహం: రాజ్ నాథ్ సింగ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతిమాలివాల్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించనున్నారనే సమాచారంతో ఆప్ పార్టీ భగ్గుమంది. సీఎం కేజ్రీవాల్ తల్లిదండ్రుల విచారణను వ్యతిరేకించారు. అయితే గురువారం విచారణ చేపట్టడం లేదని పోలీసులు వెల్లడించారు. మరోవైపు విభవ్ పోలీస్ కస్టడీ గురువారంతో ముగియనుంది. ముంబై నుంచి బుధవారం రాత్రి విభవ్ ను ఢిల్లీకి తీసుకువచ్చారు. ముంబైలో మూడు ప్రాంతాల్లో విచారణ కొనసాగించారు.
దాడిపై నోరు మెదపరా?
స్వాతిమాల్ వాల్ పై దాడి జరిగితే ఇప్పటివరకూ ఆప్ పార్టీ సీఎం కేజ్రీవాల్ నోరు మెదకపోవడం విచారకరమని స్మృతి ఇరానీ మండిపడ్డారు. సాక్షాత్తూ సీఎం ఇంట్లోనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడుంటుందని ప్రశ్నించారు. పోలీసులు విచారణ చేపడతామంటే, వాంగ్మూలాలు నమోదు చేస్తామంటే భయపడుతున్నారెందుకని ప్రశ్నించారు. మీ పార్టీ లో ఉన్న సచ్ఛీలత ఏంటో దేశం మొత్తానికి తెలుసన్నారు. మనీష్ సిసోడియాపై నిన్ననే హైకోర్టు తీర్పును కూడా ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన పార్టీ ఇప్పుడు మహిళలపై దాడులకు కూడా వెనుకాడడం లేదన్నారు. పోలీసుల విచారణ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలన్నారు. తానేమీ పోలీసు అధికారిని కాదని బీజేపీ నాయకురాలిని అన్నారు. పోలీసుల విచారణలో నిజాలు నిగ్గుతేలుతాయని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.
మహిళలపై దాడి.. హజారేకు ద్రోహం ఆప్ పార్టీ తీరుపై రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం..
మహిళలకు కూడా సీఎం ఇంటిలోనే భద్రత కల్పించలేని చేతకాని ప్రభుత్వం మీదని సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. భారత్ లో కాంగ్రెస్ కు బీ టీమ్ గా ఆప్ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురువు అన్నా హజారేకే ద్రోహం చేశాడని ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందగలడని ప్రశ్నించారు.