ప్రసిద్ధ జాతులలో ఖడ్గమృగం ఒకటి
Rhinoceros is one of the famous species
ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి
వాటిని సంరక్షించుకుందాం
కజిరంగా పార్కును సందర్శించాలి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భూమిపై అత్యంత ప్రసిద్ధ జాతులలో ఖడ్గమృగం ఒకటని వాటి సంరక్షణకు మానవాళి నిబద్ధను ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించాలని పర్యాటకులు, సందర్శకులను కోరారు. భారతదేశంలోని అత్యంత పెద్దదైన ఈ పార్కులో ఖడ్గమృగాల సంరక్షణపై నిబద్ధతను తెలిపారు. ఈ ప్రయత్నాలలో వాటిని సంరక్షించడంలో భాగస్వాములుగా నిలిచిన ప్రతీఒక్కరికి ప్రధాని మోదీ అభినందించారు.