పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ భగ్గు
జాతివివక్ష వ్యాఖ్యలన్న సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ గురువు పిట్రోడా కంగనా రౌనత్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు పిట్రోడా వ్యాఖ్యలు జాత్యాహంకారానికి సంబంధించినవని వెంటనే ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పిట్రోడాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పిట్రోడా వ్యాఖ్యలు జాతివివక్షకు సంబంధించినవన్నారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు.
కంగనా రౌనత్..
కాగా పిట్రోడా వ్యాఖ్యలపై కంగనా రౌనత్ మండిపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో ఆమె వ్యాఖ్యలను ఖండించారు. పిట్రోడా రాహుల్ గాంధీకి గురువన్నారు. ఆయన నక్సలైట్, విభజన మాటలు విన్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచనే విభజించు, పాలించు అని విమర్శించారు. శామ్ పిట్రోడా భారతీయులను చైనీస్, ఆఫ్రికన్ అని పిలవడం మంచిది కాదన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని కంగనా డిమాండ్ చేశారు.