తల్లిని కోల్పోయే బాధ వర్ణణాతీతం
వర్థంతి సందర్భంగా నివాళులు కంటతడి పెట్టిన ఢిల్లీ ఎంపీ బాన్సూరి స్వరాజ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తల్లిని కోల్పోవడం కంటే దురదృష్టకరమైన సంఘటన ఏమీ ఉండదని ఆ బాధ వర్ణణాతీతమైనదని ఢిల్లీ ఎంపీ బాన్సూరి స్వరాజ్ సుష్మాస్వరాజ్ ను స్మరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. మాజ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వర్థంతి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని వీర్ సావర్కర్ పార్కులో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తన తల్లిపేరు మీద 21 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన నుంచి తల్లి దూరమై ఐదేళ్లు గడిచిందన్నారు. ఈ బాధను ఎవ్వరూ భర్తీ చేయలేరని భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని ఆధ్వర్యంఓ బీజేపీ చేపట్టిన తల్లిపేరు మీద చెట్టు అనే కార్యక్రమం ద్వారా తల్లిని పర్యావరణ రూపంలో చూసుకునే భాగ్యం కలగడం తన అదృష్టమన్నారు.
నివాళులర్పించిన వారిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా, నాయకులు కార్యకర్తలు పెద్ద యెత్తున పాల్గొన్నారు.
మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (67) 2019 ఆగస్టు 6న గుండెపోటుతో కన్నుమూశారు.