బీజేపీ నేత సిన్హా కాళ్లు మొక్కిన సీఎం
BJP leader Sinha is the CM who planted his feet
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీ సీనియర్ నేత ఆర్కే సిన్హా పాదాలకు నమస్కరించారు! ఆదివారం ఓ బిహార్ చిత్రగుప్త ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్కే సిన్హాతోపాటు సీఎం నితీశ్ ఉమార్ పాల్గొన్నారు. ఆలయ రూపురేఖలు మార్చిన ఘనత నితీశ్ కుమార్ దేనని సిన్హా అన్నారు. ఇది ఎవ్వరి వల్ల సాధ్యపడే పని కాదని అన్నారు. సీఎం నితీశ్ ధైర్య సాహసాలతోనే ఈ పని సంపూర్తిగా జరిగిందన్నారు. సిన్హా సీఎం నితీశ్ ను పొగడడంతో చుట్టూ ఉన్న వారు చప్పట్లో హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో సీఎం తన సీటు నుంచి లేచి వచ్చి ఆర్కే సిన్హా కాళ్లకు నమస్కరించారు. ఇంతలో సిన్హా ఆయన్ను పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. చిత్రగుప్త ఆలయ పునరుద్ధరణపై సీఎంకు ఆర్కే సిన్హా ధన్యవాదాలు తెలిపారు.
కాగా పలుమార్లు బహిరంగ వేదికలపై సీఎం నితీశ్ కుమార్ పీఎం మోదీ కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించగా ప్రధాని ఆయన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకొని కాళ్లకు నమస్కరించవద్దని సున్నితంగా తిరస్కారం తెలిపారు.