సంభాల్ వివాదం అఖిలేష్ మండిపడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్
BJP MP Brijlal got angry with Akhilesh over the Sambhal controversy
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ లో ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ సంభాల్ ఆరోపణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంభాల్ అఖిలేష్, ఆయన పార్టీ కుట్రలో భాగమేనన్నారు. సంభాల్ లో ప్రణాళిక ప్రకారమే వీధుల్లోకి వచ్చి వారి మధ్య వివాదాల నెపాన్ని ప్రభుత్వంపై నెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్యపోరులో భాగంగానే ఆందోళనలు జరిగాయన్నారు. సంభాల్ మసీదులో అక్రమ నిర్మాణాలు, ఎఫ్ ఐఆర్ ల నమోదులు ఎవరిపై జరిగాయని ప్రశ్నించారు. అఖిలేష్ సీఎంగా ఉండగానే అక్రమ నిర్మాణాలు జరిగాయన్న విషయాన్ని మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. దీనిపై ఎఫ్ ఐఆర్ కూడా నమోదు కావడం ప్రజలకు తెలియదని అనుకోవడం మీ అవివేకానికి నిదర్శనమని అఖిలేష్ పై బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ మండిపడ్డారు.