బక్రీద్​ కు రోడ్లపై నమాజ్​ నిషేధం

గోవధపై పూర్తి నిషేధం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ 

Jun 14, 2024 - 13:02
 0
బక్రీద్​ కు రోడ్లపై నమాజ్​ నిషేధం

లక్నో: బక్రీద్​ కు రహదారులపై నమాజ్​ చేయొద్దని యోగి ఆదిత్యనాథ్​ స్పష్టం చేశారు. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఒకవేళ ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, పోలీసులకు పలు సూచనలు సలహాలు చేశారు. బక్రీద్​ కు గోవధపై పూర్తి నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17న బక్రీద్​ పండుగ అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అధికారులు 24 గంటలు అలర్ట్​ గా ఉండాలని యోగి ఈ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.