మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంత్రి వర్గం నిర్ణయం
ఆరు కోట్ల మందికి లబ్ధి
ప్రత్యేక కార్డులు జారీ
పీఎం ఈ–బస్ కు రూ. 3,435.33 కోట్లు
గ్రామీణ సడక్ యోజన కింద రూ. 70,125 కోట్లతో 62,500కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం
రూ. 2వేల కోట్లతో మిషన్ మౌసమ్ ప్రారంభం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 70 యేళ్లు పై బడిన వృద్ధులందరికీ ‘ఆయుష్మాన్ యోజన’ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాతో 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కొత్త ప్రత్యేక కార్డును అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.
క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాలను సీనియర్ సిటిజన్లకు అందిస్తామన్నారు. దీని కోసం ప్రత్యేక కార్డులను జారీ చేస్తామన్నారు.
పీఎం ఈబస్ సేవా-చెల్లింపు భద్రతా యంత్రాంగం (పీఎస్ఎం) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3,435.33 కోట్ల ఆర్థిక వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సులను (ఈ–-బస్సులు) కొనుగోలు చేయడం, నిర్వహించడంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీలకు (పీటీఏ) సహాయం చేయనుంది.
మారుమూల గ్రామాలకు ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 62500 కిలోమీటర్ల కొత్త రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.70,125 కోట్లు వెచ్చించనున్నారు. రూ. 2000 కోట్లతో రూపొందించిన మిషన్ మౌసమ్‌ను ప్రారంభించనున్నారు. ఇందులోభాగంగా డేటా మోడలింగ్, కొత్త తరం రాడార్, డేటా బేస్డ్ టెక్నాలజీపై దృష్టి సారించనున్నారు. మీరు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని పొందుతారు, ఇది వ్యవసాయం మరియు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.