అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు
Sharannavaratri with great splendor
నా తెలంగాణ, మెదక్: మెదక్ మండలం కూచన్ పల్లి గ్రామంలో దుర్గా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా దుర్గా నవరాత్రులను అమ్మవారి మాలలు ధరించి స్వాములు తీర్థప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందజేస్తున్నారు. ప్రతిరోజు సాంస్కృతి కార్యక్రమాలు సాయంకాలం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అమ్మవారికి కుంకుమార్చనలు, ఓడిబియ్యాలు, బోనాల సమర్పణలు చేస్తున్నారు. తొమ్మిదో రోజు అమ్మవారికి ప్రసాదాన్ని నివేదన చేసి సుహాసిని కన్యాకుమారి పూజ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దసరా మరుసటి రోజు అమ్మవారి విగ్రహ నిమజ్జనం ఊరేగింపు ద్వారా చేస్తామని నిర్వాహకులు తెలిపారు. దీంతో నవరాత్రి ఉత్సవాల క్రతువు పూర్తయినట్లవుతుందన్నారు. 32మంది అమ్మవారి మాలధారణ చేశారు. 21వ వార్షికోత్సవం దేవా, సిద్దా గౌడ్ లు గురుస్వాములుగా, ఆకుల శ్రీనివాస్, కె. యేసయ్య, సిద్దయ్య, పండరి గౌడ్ లు మాలధారణ చేసిన వారిలో ఉన్నారు.