టీటీఈకి టీఎంసీ ఎమ్మెల్యే బెదిరింపులు

TMC MLA threats to TTE

Sep 4, 2024 - 15:11
 0
టీటీఈకి టీఎంసీ ఎమ్మెల్యే బెదిరింపులు

భార్య స్థానంలో మరో మహిళతో ప్రయాణం
నిలదీసి జరిమానా విధించిన టీటీఈ
రైల్వే శాఖకు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి

కోల్​ కతా: టీఎంసీ ఎమ్మెల్యే రైలులో తన భార్య పేరు మీద ఉన్న టికెట్​ తో మరో మహిళతో ప్రయాణించడమే గాక తనను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టీటీఈ రైల్వేశాఖకు బుధవారం ఫిర్యాదు చేశాడు. 14226 (డెహ్రాడూన్​–బనారస్​) ఎక్స్​ ప్రెస్​ రైలులో టీఎంసీ ఎమ్మెల్యే కనై చంద్రమండల్​ ప్రయాణిస్తున్నాడు. టీటీఈ టికెట్లు తనిఖీ చేసేందుకు రాగా ఎమ్మెల్యేతోపాటు పక్కనే ఉన్న మరో మహిళను టికెట్​ అడిగాడు. ఎమ్మెల్యే టికెట్​ అందించగా అసలు ప్రయాణికురాలి బదులుగా మీరు ప్రయాణం చేయడం నేరమన్నాడు. జరిమానా విధించాడు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యే పెద్ద రాద్దాంతం సృష్టిస్తూ చంపేస్తానని అతన్ని బెదిరించాడు. భార్య పేరుతో ఉన్న టికెట్​ పై మహిళతో ప్రయాణించడమే గాక తనపైనే బెదిరింపులకు పాల్పడడాన్ని టిటీఈ రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేశాడు. టీఎంసీ ఈ వ్యవహారాన్ని పలువురు నెటీజనులు ‘ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య’గా వ్యవహరిస్తుండడం కొసమెరుపు.