హిందువులపై దాడులు.. బీజేపీ స్వచ్ఛందంగా బంద్
Attacks on Hindus.. BJP Voluntary Bandh
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే మారణకాండ నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో వ్యాపారస్తులు మంగళవారం స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
బీజేపీ నాయకులు బైకులపై ఊరేగింపుగా బయలుదేరి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు వేముల అశోక్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కరువైందని, వెంటనే వారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముశ్ల పోశం, పట్టణ ప్రధాన కార్యదర్శి కట్ట ఈశ్వర చారి, మాసు సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు ముద్దసాని శ్రీనివాస్, వైద్య శ్రీనివాస్, బీజేపీ పట్టణ కార్యదర్శి జీడి ప్రభాకర్, బీజేపీ పట్టణ కార్యదర్శి ఓరుగంటి సాయి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి కళాధర్ రెడ్డి, సీనియర్ నాయకులు బంగారు వేణుగోపాల్, ఠాగూర్ దన్ సింగ్, దండు రాజేందర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సంతోష్ రామ్ నాయక్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి బద్రి సతీష్ తదితరులు పాల్గొన్నారు.