ఇరాన్ కు అమెరికా వార్నింగ్
ఇజ్రాయెల్ పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ఉగ్రవాదులపై చేస్తున్న దాడులకు ప్రతిస్పందిస్తూ ప్రతిదాడులకు దిగే యత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ హిజ్బొల్లా, హమాస్, హౌతీ ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకుందని పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు సహాయంగా యుద్ధవిమానాలు, సైనికులను పంపింది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పలుదేశాల సరిహద్దుల వెంట 40వేల మంది యూఎస్ దళాలు మోహరించి ఉన్నాయి. వీరికి అదనంగా మరో 23 వేల మందిని పంపినట్లు తెలిపింది. అంతేగాక ఎఫ 15, ఎఫ్ 16, ఎప్ 22, ఏ10 యుద్ధవిమనాలను కూడా పంపినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనా సింగ్ తెలిపారు.
అమెరికా సైనికులు ఏయే దేశ సరిహద్దుల్లో..
జోర్డాన్ లో 3000మంది, సౌదీలో 2700మంది, యూఏఈలో 3500మంది, ఖతర్ లో పదివేల మంది, టర్కీలో 1465మంది, సిరియాలో 800మంది, ఇరాక్ లో 2500మంది, కువైత్ లో 13,500మంది అమెరికా సైనికులను ఇప్పటికే మోహరించారు.