పదేళ్లలో ఈడీ పంజా
గతంలో కంటే 25 శాతం ఎక్కువ ఆస్తుల జప్తు దాడుల్లో వృద్ధి రేటు 86 శాతం రూ.1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు 755 మందిని అరెస్టు, 1,971 అటాచ్‌మెంట్ ఉత్తర్వులు జారీ
నా తెలంగాణ, న్యూఢిల్లీ: గత పదేళ్లలో ఈడీ మూడు రెట్లు దాడులు పెంచింది. 25 రెట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు పలు గణాంకాల ద్వారా స్పష్టం అవుతోంది. 86 రెట్లు ఎక్కువ దాడులు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఇడి దాడులు భారీగా పెరిగాయి. ఈ కాలంలో ఈడీ 25 రెట్లు ఎక్కువ ఆస్తులను జప్తు చేసింది. 2014 కంటే ముందు తరువాత గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం వెల్లడించింది. ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2024 మధ్య డేటాను జూలై 2005 నుంచి మార్చి 2014 వరకు ఉన్న డేటాతో పోల్చి చూస్తే, క్రియాశీలక పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత, నల్లధనం, మనీలాండరింగ్ నిరోధించేందుకు ఈ చట్టాన్ని సమర్థవంతంగా ఈడీ పదేళ్లలో ఉపయోగించుకుంది. ఈడీ ఎలాంటి ఒత్తిడి లేకుండా అవినీతికి వ్యతిరేకంగా స్వతంత్రంగా దర్యాప్తు చేసే సంస్థ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్).
గత పదేళ్లలో పీఎంఎల్ ఏ చట్టం కింద ఈడీ 5,155 కేసులను నమోదు చేయగా, కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల సంఖ్య 1,797 మూడు రెట్లు ఎక్కువ . 63 మందిని దోషులుగా తేల్చింది. 2014లోనే తొలి శిక్ష విధించింది. బీజేపీ ప్రభుత్వ హయాంలో మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ 7,264 దాడులు నిర్వహించగా, 2014కి ముందు ఈడీ 84 దాడులు మాత్రమే జరగడం విశేషం. చేసింది.
గత దశాబ్ద కాలంలో ఈడీ 755 మందిని అరెస్టు చేసి రూ.1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయగా, గత ప్రభుత్వ హయాంలో ఈడీ 29 మందిని అరెస్టు చేసి రూ.5,086 కోట్ల ఆస్తులను మాత్రమే జప్తు చేయగలిగింది. అరెస్టులు 26 రెట్లు పెరగగా, ఆస్తులు 24 శాతం స్వాధీనం చేసుకుంది. 1,971 అటాచ్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేయగా, అంతకుముందు 311 అటాచ్ మెంట్లు మాత్రమే ఉండడం గమనార్హం.
గత పదేళ్లలో పీఎంఎల్‌ఏ చట్టం కింద రూ.2,310 కోట్ల విలువైన నగదును ఈడీ స్వాధీనం చేసుకోగా, అంతకుముందు రూ.43 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకుంది. నలుగురు నిందితులను భారత్‌కు రప్పించింది.