ప్రతిభ వెలికితీసే చర్యలపై కలెక్టర్ హర్షం
The collector is happy with the steps taken to bring out talent
నా తెలంగాణ, ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు చేసిన ప్రయత్నంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, కేజిబివి, పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులతో కలిసి కుంటాల జలపాతానికి విహార యాత్రకు తీసుకువెళ్లారు. ఈ విహార యాత్రను జిల్లా కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు.