కోకో ద్వీపాన్ని నెహ్రూ అప్పగించారు!

అండమాన్​ నికోబార్​ బీజేపీ నేత విష్ణు పాడ్​ రే ఆరోపణ

Apr 17, 2024 - 14:32
 0
కోకో ద్వీపాన్ని నెహ్రూ అప్పగించారు!

అండమాన్​ నికోబార్​: అండమాన్​ నికోబార్​ దీవుల్లోని కోకో ద్వీపాన్ని అప్పటి ప్రధాని నెహ్రూ మయన్మార్​ కు అప్పగించారని ఆ ప్రాంత బీజేపీ నాయకుడు విష్ణు పాడ్​ రే ఆరోపించారు. ఈ ద్వీపం ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉందన్నారు. బుధవారం మీడియాతో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ దీవిని స్వాధీనం చేసుకునేందుకు అటుపిమ్మట కాంగ్రెస్​ ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నించలేదని మండిపడ్డారు. దేశాన్ని కొద్దికొద్దిగా కాంగ్రెస్​ పార్టీ ముక్కలు చేసిందని మండిపడ్డారు.

అయితే కోకో దీవులను నిజంగానే నెహ్రూ ఇచ్చారా? అనే విషయాలపై సందగ్ధత నెలకొంది. బ్రిటిష్​ పాలనలో ఉన్న అండమాన్​ నికోబార్ దీవులు ఉండేవి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అండమాన్ నికోబార్ కూడా స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యాయి. కానీ కోకో దీవులను బ్రిటిష్ వారు మయన్మార్ (అప్పటి బర్మా)కి అప్పగించారు. ఆ సమయంలో బర్మా కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కోకోదీవులను బ్రిటీష్​ ప్రభుత్వం మయన్మార్​ కు అప్పగించడంపై నెహ్రూ ఏ మాత్రం సంకోచించలేదని వ్యతిరేకత వ్యక్తం చేయలేదనే ఆరోపణలను విష్ణు వ్యక్తం చేశారు.

ఇప్పటికే కచ్చతీవును ద్వీపాన్ని కాంగ్రెస్​ శ్రీలంకకు అప్పగించిందని కేంద్ర ప్రభుత్వం పలువేదికలపై ఆ చరిత్రను ఊటంకిస్తూ వస్తోంది. దీంతో భారత్​ కు భారీ నష్టమే ఏర్పడుతోందని తెలిపింది. ఏది ఏమైనా అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం చర్యల వల్ల దేశం ముక్కలు కావడానికి కారణమని చరిత్రకారులు పేర్కొంటున్నారు.