రెపోరేటు యథాతథం
6.50 శాతంగా ఉంచాలని ఎంపీసీ నిర్ణయం జీడీపీ వృద్ధిరేటు 7.2గా అంచనా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తొమ్మిదోసారి రెపోరేటును 6.50 శాతం వద్దే ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అదే సమయంలో జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో గురువారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీంతో రుణాల ఈఎంఐలలో ఎలాంటి మార్పు చేర్పులు చేయలేదు.
ఎంపీసీ సమావేశంలో ఆరుగురు సభ్యుల్లో నలుగురు సభ్యులు రెపోరేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించారని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఇది ద్రవ్యోల్బణాన్ని స్థిరమైన స్థాయికి తీసుకురావడం, అనిశ్చిత మధ్య ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 2024–25లో ద్రవ్యోల్బణం 7.2 శాతం వద్దే సెంట్రల్ బ్యాంక్ ఉంచిందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతంగా అంచనా వేశామన్నారు.