బిట్ కాయిన్ మోసం నటి శిల్పా, భర్త రాజ్ కుంద్రా ఆస్తుల జప్తు
రూ. 98 కోట్ల స్థిరాస్థులను జప్తు చేసిన ఈడీ
న్యూఢిల్లీ: మనీటాండరింగ్ కేసులో ప్రముఖ నటీ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన రూ. 98 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు పేర్కొంది. ఇందో నటికి చెందిన ఫ్లాట్, నివాస భవనం, ఆమె భర్త రాజ్ కుంద్రా పేరిట ఉన్న షేర్లు కూడా ఉన్నట్లు గురువారం వెల్లడించింది. 2002లో బిట్ కాయిన్ కు సంబంధించి భారీ స్కామ్ జరిగింది. ఈ కేసులో బిట్ కాయిన్ల పేరుతో ప్రజల నుంచి పలువురు ప్రముఖులు రూ.6600 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. నిందితులు అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, సింపి భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ఇతరులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి పలు రాష్ర్టాల పోలీసులు, ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
2017లోనే రూ. 6600 కోట్లు సేకరించిన వీరు ప్రతీ నెలా 10 శాతం రిటర్న్ ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. కానీ దీని ప్రకారం రిటర్న్ తిరిగి ఇవ్వలేదు. దీంతో పెట్టుబడిదారులంతా మోసపోయామని గ్రహించి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. సేకరించిన మొత్తాన్ని నిందితులు బిట్ కాయిన్ల రూపంలో వాలెట్లలో దాచారు. శిల్పాశెట్టి, ఆమె భర్త అమిత్ భరద్వాజ్ ద్వారా 285 బిట్ కాయిన్ లను అందుకున్నారని ఈడీ నిర్ధారించింది. దాని విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం 150 కోట్ల రూపాయలుంటుందన్నారు. గతంలో కూడా ఇదే కేసులో నిందితులకు సంబంధించిన పలు ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
రాజ్ కుంద్రా గతంలో అశ్లీలానికి సంబంధించిన కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యాడు. రెండు నెలల తరువాత బెయిల్ పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే.