కన్యాకుమారిలో పట్టు బిగించిన రాధాకృష్ణన్
తమిళనాడులోని కన్యాకుమారి లో బీజేపీ అభ్యర్థి పి. రాధాకృష్ణన్ మంచి పట్టును సాధించారు.
కన్యాకుమారి: తమిళనాడులోని కన్యాకుమారి లో బీజేపీ అభ్యర్థి పి. రాధాకృష్ణన్ మంచి పట్టును సాధించారు. ఇక్కడ క్రైస్తవుల కంటే హిందువుల జనాభాలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ ఆది నుంచి రాధాకృష్ణన్ క్రైస్తవ వర్గాల మమేకంతో ఉండడంతో ఈసారి ఈయన గెలుపు ఖాయంగానే కనిపిస్తుంది. ఈ స్థానం నుంచి గతంలో రెండుసార్లు బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం తమిళనాడు పాలిటిక్స్ లో ఎక్కడ చూసినా కచ్చతీవు దీవి, శ్రీలంక స్వాధీనం, మత్స్యకారుల అరెస్టులు, మోదీ చొరవతో భారత విదేశాంగ శాఖ వారిని సురక్షితంగా విడిపించడంపైనే రాజకీయాలు కొనసాగుతున్నాయి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలు కూడా ప్రజల్లో విశేషాధారణకు నోచుకున్నాయి. దీంతో ఇక్కడి బీజేపీ అభ్యర్థి పి. రాధాకృష్ణన్ ఆయా వర్గాలను కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగం చేయడంలో ఆది నుంచే క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో ఈయన విజయం నల్లేరు మీద నడకేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.