దక్షిణ కశ్మీర్ లో హిజ్బుల్ లేనట్టే! చివరి కమాండర్ హతం
As if there is no Hizbul in South Kashmir! The last commander was killed
ఫరూఖ్ నాలీపై రూ. 10 లక్షల రివార్డు
శ్రీనగర్: కుల్గామ్ లో గురువారం ఉదయం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ ఎట్టకేలకు 10 గంటలు సాయంత్రం వరకు కొనసాగి ముగిసింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన కీలక కమాండర్ ఫరూఖ్ నాలీని భద్రతా దళాలు మట్టు బెట్టాయి. ఇతనిపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. దక్షిణ కశ్మీర్ లోయలో హిజ్బుల్ చివరి కమాండర్. దీంతో హిజ్బుల్ ఉగ్ర సంస్థ తుడిచిపెట్టుకుపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఫరూఖ్ నాలీ 2014–15లో హిజ్బుల్ ముజాహిదీన్ లో చేరాడు. 14 మంది కమాండర్లలో ఇతనొక్కడే మిగిలి ఉండగా, గురువారం ఇతన్ని కూడా భద్రతా దళాలు మట్టుబెట్టాయి. గతంలో అనేకమార్లు భద్రతాదళాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం భద్రతా దళాలు పన్నిన ఉచ్చులో చిక్కుకుపోయాడు. కాగా ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలు ఉగ్రవాదుల నుంచి పెద్ద యెత్తున ఆయుధాలు, గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నాయి.
కేంద్రమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం..
జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూలాలను పూర్తిగా పెకిలించే దిశగా చర్యలు చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూ ఢిల్లీలో అత్యున్నతస్థాయి భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లు, జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్, హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సదానంద్ డేట్, బీఎస్ఎఫ్ చీఫ్ దల్జీత్ సింగ్ చౌదరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే చర్యలను మరింత పటిష్టం చేయాలన్నారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న ప్రతీఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దుల వెంట నిఘాను ముమ్మరం చేయాలన్నారు. ఉగ్రవాదుల సమాచారాన్ని సంయుక్తంగా విశ్లేషిస్తూ ముందుకు వెళ్లాలని అమిత్ షా సమావేశంలో తెలిపారు.