నిర్ణయం బాధాకరం దేశమంతా మీ వెంటే
నిరాశ చెందొద్దు వినేష్ ఫోగట్ డిస్ క్వాలిఫైపై ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వినేష్ ఫోగట్ చాంపియన్ లకే చాంపియన్ అని విశ్వసిస్తున్నామని ఒలింపిక్ నిర్ణయం చాలా బాధకరమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రతీ భారతీయుడికి ఫోగట్ స్ఫూర్తిగా నిలుస్తారని ఆమె దేశానికి గర్వకారణమని ప్రధాని తెలిపారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొందామన్నారు. ఎలాంటి నిరాశకు లోను కావద్దని ప్రధాని పేర్కొన్నారు. దేశమంతా వినేష్ ఫోగట్ వెంట ఉంటుందని ప్రధాని సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేశారు.
మరోవైపు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కూడా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. పూర్తి సమాచారం తీసుకున్నారు. వినేష్ విషయంలో ప్రత్యామ్నాయమార్గాలపై అన్వేషించాలన్నారు. అనర్హత వేటు వేయడంపై భారత్ నిరసనను వ్యక్తం చేయాలని పీటీ ఉషకు ప్రధాని మోదీ సూచించారు.