సబ్సిడీ ఖర్చులను సమీక్షించాలి: ఆర్బీఐ

Subsidy costs to be reviewed: RBI

Dec 19, 2024 - 19:09
 0
సబ్సిడీ ఖర్చులను సమీక్షించాలి: ఆర్బీఐ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సబ్సిడీ ఖర్చులను అత్యవసరంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ తెలిపింది. సబ్సిడీలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా రాష్​ర్టాలకు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన, మౌలిక సదుపాయాలలో రాష్​ర్టాలలో పెట్టుబడులపై సబ్సిడీలపై ఆర్బీఐ గురువారం నివేదిక విడుదల చేసింది. స్థిరమైన ప్రాతిపదికన ఉద్యోగలు, పేదరికం తగ్గుదలకు ఈ నిర్ణయం సహకరిస్తుందని పేర్కొంది. సబ్సిడీ లాంటి వాటిని పరిమితం చేయాలని తెలిపింది. సబ్సిడీ వ్యయాలను నియంత్రిస్తేనే వ్యయం, ఉత్పాదకతలపై ప్రభావం చూపదన్నారు. ఉచితాలు అందుబాటులోని వనరులను హరించివేస్తాయని, క్లిష్టమైన సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలను నిర్మించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని ఆర్బీఐ చెప్పింది. ఉచితాల భారం కారణంగా రాష్ర్టాలు ఆర్థిక ఏకీకరణకు కట్టుబడి ఉంటేనే వృద్ధి, మూలధన వ్యయంపై ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. ఉద్యోగాల కల్పన, స్థిరమైన వృద్ధితోనే దేశ ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని ఆర్బీఐ తెలిపింది. సబ్సిడ పెరగడం వల్ల కొత్త ఒత్తిళ్లు తలెత్తుతున్నాయని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వాలు తమ స్థూల ఆర్థిక లోటును జీడీపీలో 3శాతం లోపల ఉంచుకోవాలని, 2023–24లో జీడీపీలో 0.2 శాతానికి తగ్గించడానికి ఆర్బీఐ కట్టుబడి నివేదిక పేర్కొంది. ఆర్థిక ఏకీకరణే రాష్ర్టాల మూలధన వ్యయం పెంచేందుకు, ఖర్చుల నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయపడిందని ఆర్బీఐ తెలిపింది.