నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం

భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, బల్వీందర్ సంధులను ఎన్నికల సంఘం నియమించింది.

Mar 14, 2024 - 16:28
 0
నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం

నా తెలంగాణ, ఢిల్లీ: భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, బల్వీందర్ సంధులను ఎన్నికల సంఘం నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కమిటీతో సమావేశం అనంతరం గురువారం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడం, అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ కారణంగా ఈ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పోస్టులు భర్తీ అయ్యాయి. నూతన కమిషనర్లను వీలైనంత త్వరలో నియమిస్తామని ఇటీవలే ఎన్నికల సంఘం కమిషనర్​ రాజీవ్​ కుమార్​ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు నియామకాల ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 15న అత్యవసర విచారణకు అంగీకరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం నిర్ణయం తీసుకుంది.