అన్ని రంగాల్లో అభివృద్ధే ప్రధాని లక్ష్యం

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్​

Mar 14, 2024 - 16:30
 0
అన్ని రంగాల్లో అభివృద్ధే ప్రధాని లక్ష్యం

నా తెలంగాణ, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ప్రపంచ దేశాలన్నీ భారత్​ను ఎదిగే ఆర్థిక వ్యవస్థగా చూస్తున్నాయని ప్రధాని ఏ దేశానికి వెళ్లినా రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలుకుతున్నారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్సూరాబాద్‌- బండ్లగూడ రోడ్డులోని మహవీర్‌ హరిణ వనస్థలి పార్కులో మార్నింగ్‌ వాకర్స్‌తో గురువారం ఈటల సమావేశమయ్యారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని వాకర్స్‌ను కోరారు. మరోసారి మోదీ ప్రభుత్వమే రావాలని దేశమంతా కోరుకుంటుందని, రాష్ట్రంలోనూ మెజారిటీ సీట్లు బీజేపీయే గెలుచుకోబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి సురేందర్‌నాథ్‌ యాదవ్‌, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.