కోర్టు విచారణ వీడియోలను తొలగించండి

సునీతా కేజ్రీవాల్​ కు కోర్టు నోటీసులు తొలగించకుంటే చర్యలు తప్పవు

Jun 15, 2024 - 15:42
 0
కోర్టు విచారణ వీడియోలను తొలగించండి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్​ కు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. కోర్టు విచారణను సోషల్​ మీడియాలో పెట్టడాన్ని తప్పుబట్టింది. వెంటనే ఆ వీడియోలను తొలగించాలని కోర్టు నోటీసులు పంపింది. సునీతా కేజ్రీవాల్​ తో పాటు మరో ఐదుగురికి ఈ నోటీసుల ద్వారా ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోస్ట్​ లు, రీ పోస్ట్​ లకు సంబంధించి సోషల్​ మీడియాలో కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లిక్కర్​ కేసుకు సంబంధించి కోర్టు విచారణ కార్యకలాపాలను సునీతా కేజ్రీవాల్​ మరో ఐదుగురు వీడియోలను రికార్డింగ్​ చేసి రీపోస్ట్​, షేర్​ చేయడం లాంటివి చేశారు. దీనిపైనే కోర్టు వీరందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కార్యకలాపాలను నిషేధించినా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రయత్నిస్తారా? అని సునీతను ప్రశ్నించింది. వెంటనే వాటన్నింటినీ తొలగించాలని లేకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.