ఆరోపణలు అవాస్తవం చట్టపరంగా ముందుకు: అదానీ గ్రూప్​

Allegations untrue Legally forward: Adani Group

Nov 21, 2024 - 14:06
 0
ఆరోపణలు అవాస్తవం చట్టపరంగా ముందుకు: అదానీ గ్రూప్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని గురువారం అదానీ గ్రూప్​ ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్లపై యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్​ జస్టిన్​ విభాగం కూడా ఇదే చెప్పిందన్నారు. ఈ ఆరోపణలపై న్యాయపరంగా ముందుకు వెళతామన్నారు. అదానీ గ్రూపు పారదర్శకత, నియంత్రణ, నియమాలను ఎల్లప్పుడూ అనుసరిస్తుందన్నారు. అదే సమయంలో తమ వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులందరూ చట్టాన్ని గౌరవిస్తారని సంస్థ ప్రకటనలో స్పష్టం చేసింది. రూ. 2200 కోట్ల లంచాలు చెల్లించినట్లు అదానీ గ్రూప్​ పై న్యూయార్క్​ లోని ఫెడరల్​ కోర్టులో అక్టోబర్​ లో పిటిషన్​ దాఖలైంది.