బిహార్ లో వరదలు
ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నితీశ్ ఏయిర్ సర్వే
10జిల్లాల్లో వేలాదిమంది నిరాశ్రయులు
పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తీవ్రంగా నష్టపోయిన రైతులు
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశం
పట్నా: వరద ప్రభావిత ప్రాంతాల్లో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను ముమ్మరం చేయాలని శుక్రవారం అధికారులను ఆదేశించారు. గంగా, ఇతర నదులు వర్ష ప్రభావంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 10కి పైగా జిల్లాలు వరద బారిన పడ్డాయి. పట్నా, బక్సర్, బెగుసరాయ్, సరన్, సివాన్, వైశాలి, సమస్తిపూర్, ఖగారియా, ముంగేర్, భాగల్ పూర్, నలంద, గయా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహాక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. భారీగా పంటలు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించి సహాయక శిబిరాల్లో చోటు కల్పించారు.