మోదీ మరో నినాదం.. మేక్ ఫర్ ది వరల్డ్
ఏరోస్పేస్, రక్షణ రంగాలపై చర్చ ప్రధాని మోదీతో లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టెస్లెట్ భేటీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' విజన్‌ని సాకారం చేసేందుకు రక్షణ రంగ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ నిబద్ధతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టెస్లెట్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
భారత్–యూఎస్ ఏరోస్పేస్, రక్షణ పారిశ్రామిక రంగాల్లో సహకారాన్ని ప్రధాని స్వాగతించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఏరోస్పేస్, రక్షణ రంగాల బంధాలపై చర్చలు జరిగాయి.
ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మేథో సంపత్తి రక్షణ, ప్రపంచస్థాయి తయారీ మౌలిక సదుపాయాల కల్పనపై ఇరువురు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియాతోపాటు మేక్ ఫర్ ది వరల్డ్ అనే కొత్త నినాదాన్ని ఇచ్చారు. ప్రపంచ సంక్షేమం భారత్ కు ముఖ్యమన్నారు.