సల్మాన్​ ఇంటిపై కాల్పుల ఘటన నిందితుడు థాపన్​ ఆత్మహత్య

సల్మాన్​ ఖాన్​ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం బ్రాంచ్​ కస్టడీలో ఉన్న నిందితుడు బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగుతోంది.

May 1, 2024 - 15:55
 0
సల్మాన్​ ఇంటిపై కాల్పుల ఘటన నిందితుడు థాపన్​ ఆత్మహత్య

ముంబై: సల్మాన్​ ఖాన్​ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం బ్రాంచ్​ కస్టడీలో ఉన్న నిందితుడు బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగుతోంది. గెలాక్సీ అపార్ట్​ మెంట్​ లో నిందితులు కాల్పులకు పాల్పడ్డారు. నిందితుడు అనుజ్​ థాపన్​ బాత్​ రూమ్​ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 

ఈ ఘటన అనంతరం సల్మాన్​ కు భద్రత కూడా పెంచారు. కేసు విచారణ జరిపిన పోలీసులు అనుజ్​ థాపన్​ ను అరెస్టు చేశారు. ఇతనే కాల్పులు జరిపిన ఇద్దరికి ఆయుధాలు అందించినట్లుగా పోలీసులు తెలిపారు. ముంబై క్రైమ్​ బ్రాంచ్​ దర్యాప్తు అనంతరం పంజాబ్​ కు చెందిన థాపన్​ ను అరెస్టు చేశారు. ఏప్రిల్​ 14న ఉదయం 5 గంటల ప్రాంతంలో గెలాక్సీ అపార్ట్​ మెంట్​ లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసుల విచారణలో ఐదు బుల్లెట్లు లభించాయి.