పోరాటం మధ్యలో పారిపోతారా?
రాహుల్ పై మండిపాటు ఓటమి భయం పట్టుకుంది రోహ్ తక్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
హరియాణా: రాహుల్ గాంధీ వయొనాడ్, అమేథీల నుంచి పోరాటం మధ్యలోనే పారిపోయారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. ఓటమి భయంతోనే ఆయన పోరాటం మధ్యలో తప్పుకున్నారని అన్నారు. హరియాణాలోని రోహ్ తక్ బీజేపీ అభ్యర్థి అరవింద్ శర్మ తరపున రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ పై విరుచుకుపడ్డారు.
పాక్, బంగ్లా, అమెరికాలతో పోలిస్తే భారత్ లో ఎరువుల ధరలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. మోదీ మార్క్ పాలనలో భారత్ దినదినాభివృద్ధి చెందుతుందన్నారు.
పుల్వామా దాడిలో పాక్ ప్రమేయం ఉందని చెప్పిన పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి, ప్రస్తుతం రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం చేశారు.
బీజేపీపై అభిమానం ఉన్న నేతల రాజీనామాతోనే పలు స్థానాలు ఏకగ్రీవమవుతున్నాయని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 20 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఎన్నికయ్యారని అప్పుడు లేని ప్రజాస్వామ్య ముప్పు ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్, కూటమి పార్టీల తీరుతోనే ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు పొంచి ఉందని దేశ ప్రజలు గుర్తించారని తగిన సమయంలో సరైన తీర్పునీయబోతున్నారని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.