ఫేక్ వార్తలపై చర్యలు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
Union Minister Ashwini Vaishnav will take action against fake news
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తప్పుడు వార్తలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం లోక్ సభలో లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు. వివిధ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో నకిలీ వార్తలను గుర్తించేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలను చేపట్టిందన్నారు. తప్పుదోవ పట్టించ సమాచార వ్యాప్తిని నియంత్రిస్తామన్నారు. నకిలీ వార్తలను ఎదుర్కోవడానికి 2019 నవంబర్‌లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (ఎఫ్‌సియు)ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2021 నుంచి 2024 వరకు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి ఐదు ఫేక్ న్యూస్ ఫిర్యాదులపై తీర్పునిచ్చిందని మంత్రి తెలిపారు.