సుప్రీంలో సీఎం కేజ్రీవాల్​ బెయిల్​ పిటిషన్​

CM Kejriwal's bail petition in the Supreme Court

Aug 12, 2024 - 15:37
 0
సుప్రీంలో సీఎం కేజ్రీవాల్​ బెయిల్​ పిటిషన్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ బెయిల్​ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశారు. తన అరెస్టును సవాల్​ చేస్తూ పిటిషన్​ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్​ లో నగర, రాష్ర్ట కోర్టుల్లో బెయిల్​ నిరాకరణ అంశాన్ని కూడా ప్రస్తావించారు. తనకు బెయిల్​ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని తెలిపారు. తన పిటిషన్​ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంను కోరారు. 

కాగా ఇటీవలే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఆప్​ పార్టీ నాయకుడు సిసోడియాకు సుప్రీం పలు షరతులతో కూడిన బెయిల్​ ఇచ్చింది.