అవామీ లీగ్​ నాయకులను భారత్​ ఆదుకోవాలి

బంగ్లాలో దిగజారుతున్న పరిస్థితులపై ఆవేదన నాయకులు, మైనార్టీలపై పెచ్చుమీరుతున్న దాడులు అవామీ లీగ్​ పార్టీ కార్యదర్శి సుజిత్​ 

Aug 12, 2024 - 14:30
 0
అవామీ లీగ్​ నాయకులను భారత్​ ఆదుకోవాలి

ఢాకా: బంగ్లాదేశ్​ లో అవామీ లీగ్​ పార్టీ నాయకుల పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని ఆ పార్టీ  కార్యదర్శి సుజిత్​ నంది అన్నారు. భారత్​ జోక్యం చేసుకొని తమను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

సోమవారం సుజిత్​ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల హింస మాటున పార్టీ నాయకులను, మైనార్టీలను టార్గెట్​ చేసుకున్నారని వాపోయారు. హింసకు భయపడి పార్టీ నాయకులంతా అండర్​ గ్రౌండ్​ లోకి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్​ నిర్మాణంలో భారత్​ కీలక పాత్ర వహించిందని గుర్తు చేశారు. పార్టీ నాయకులు పలువురు విదేశాలకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ భవిష్యత్తుపై ఉన్నతస్థాయి నాయకులతో మాట్లాడదామంటే ఏ ఒక్కరూ అందుబాటులోకి లేకుండాపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయన్నారు. బంగ్లాదేశ్​ హింస ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాన్ని కూడా పూర్తిగా దగ్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం శాంతికి పకబ్భందీ చర్యలు తీసుకోవాలని కోరారు.