ఘోరంగా బోల్తా కొట్టి ఎంవీఎస్
ప్రతిపక్ష హోదా కూడా అనుమానమే
ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల హర్షం
ముంబాయి: మహారాష్ర్ట ఎన్నికల్లో బీజేపీ (మహాకూటమి–శివసేన, ఎన్సీపీ) స్పష్టమైన మెజార్టీతో గెలుపొందాయి. మోదీ నేతృత్వంలోని ఐక్యత అనే మంత్రం రాష్ర్టంలో ఫలించింది. 288 స్థానాలకు గాను శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాత్రి వరకూ కొనసాగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ (మహాయుతి) స్పష్టమైన మెజార్టీతో విజయకేతనం ఎగురవేసింది. అదే సమయంలో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బీజేపీ నేతృత్వంలోని శివసేన (యూబిటీ), శివసేన (అజిత్ పవార్)లతో కూటమిగా కలిసి పోటీ చేసింది.
బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ, 41 స్థానాలలో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ తన వెబ్ సైట్ లో పేర్కొంది.
మహావికాస్ అఘాడీ కనీసం పోటీ ఇవ్వలేక, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయాయి. కాంగ్రెస్ (16), శివసేన (ఉద్దవ్–20), ఎన్సీపీ (శరద్–10) స్థానాలలో విజయం సాధించారు. ఇతరులు 11 స్థానాలలో విజయం సాధించారు.
ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల హర్షం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలు మహారాష్ర్ట మహాయుతి కూటమి నాయకులు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ లకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తలతో శ్రమించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. సీఎం ఎవరన్నదానిపై త్వరలోనే ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం వెలువడుతుందన్నారు. అంతవరకూ వేచి ఉండాలన్నారు. మరోవైపు బీజేపీ మహా విజయంపై సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు. కాగా ఈ ముగ్గురిలో సీఎం రేసులో బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ప్రస్తుత సీఎం షిండేలు తొలివరుసలో ఉన్నారు. కాగా సీఎం పదవిపై కేంద్ర అభీష్టం మేరకే నడుచుకుంటామని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. సీఎం షిండే కూడా శాసనసభా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఎవరన్నది తెలుస్తుందన్నారు.