పిచాయ్ కోతలు షురూ!
Pichai cuts started!
గూగుల్ లో ఏఐ దడ
పట్టు సాధించకుంటే తిలోదకాలే
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎఐ సాంకేతికత వస్తు వస్తూనే ఉద్యోగాల కోతలు మొదలవుతుందని అనుకున్నట్లుగానే జరుగుతోందనిపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ 10 శాతం ఉద్యోగాల్లో కోతను ప్రకటించింది. సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ కోతను శుక్రవారం ప్రకటించారు.
సంస్థ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో సహా మేనేజర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఉండనున్నారు. పిచాయ్ నిర్ణయం సాంకేతిక సంస్థల్లో తీవ్ర అలజడి రేపుతుంది. బిజినెస్ ఇన్ సైడర్ అనే నివేదిక ప్రకారం ఓపెన్ ఎఐ వంటి పోటీదారుల నుంచి ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)లో పెరుగుతున్న పోటీనే ఉద్యోగాల కోతకు కారణమని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా గూగుల్ సంస్థ అనేక మార్పు చేర్పులు చేస్తుంది.
సంస్థను సమర్థవంతంగా రూపొందించేందుకు సేవలను సరళీకృతం చేసేందుకు చర్యలు చేపడుతుంది. గత జనవరిలోనూ ఈ సంస్థ ఉద్యోగులను తొలగించింది. సంస్థలో ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సంస్థ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతలో నిపుణుల కోసం శోధిస్తుంది. అంతేగాక సంస్థ ఉద్యోగులు తమకున్న నైపుణ్యాలతోపాటు ఏఐ సాంకేతికతపై కూడా పట్టు సాధించాలని చెప్పకనే చెప్పింది. ఏఐ సాంకేతికతతో గూగుల్ త్వరలోనే అప్ డేట్ కానుంది.