నిలకడగా అద్వానీ ఆరోగ్యం

Advani's health is steady

Aug 6, 2024 - 18:14
 0
నిలకడగా అద్వానీ ఆరోగ్యం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధ దిగ్గజ నేత లాల్​ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో వైద్య వర్గాలు మంగళవారం స్పష్టం చేశాయి. అనారోగ్యంతో ఆయన సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరినట్లుగా తెలిపాయి. వృద్ధాప్య కారణంగా పలు రకాల రుగ్మతలతో అద్వానీ బాధపడుతున్నారని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డాక్టర్​ వినీత్​ సూరి తెలిపారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గత వారం కూడా అద్వానీ అనారోగ్య కారణాలతో ఏయిమ్స్​ లో చేరారు.