దేశంలో ఒకే రాజ్యాంగం

ఏ శక్తి 370ని తీసుకురాలేదు ప్రధాని నరేంద్రమోదీ

Nov 23, 2024 - 21:15
 0
దేశంలో ఒకే రాజ్యాంగం
మహారాష్ట్ర విజయం చారిత్రాత్మకం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత దేశంలో ఒకే రాజ్యాంగం ఉంటుందని మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అదే బాబాసాహేబ్​ అంబేద్కర్​ రాజ్యాంగమన్నారు. రెండు రాజ్యాంగాలని మభ్యపెట్టాలని చూసిన వారిని దేశ ప్రజలు తరిమి కొట్టారన్నారు. జమ్మూకశ్మీర్​ లో ఆర్టికల్​ 370 గోడలను పునర్నించాలని అనుకున్నారని అన్నారు. ఇది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమన్నారు. కాంగ్రెస్​ నాయకులు, వారి మిత్రపక్షాలు చెవులు తెరిచి వినాలన్నారు. ప్రపంచంలోని ఏ శక్తి 370ని తిరిగి తీసుకురాలేదన్నారు. 
 
నిజమైన ప్రజాస్వామ్య విజయం..
చారిత్రాత్మక విజయం ఆనందాన్ని పంచుకోవడానికి మనమంతా ఇక్కడ ఒక్కటయ్యామన్నారు. మహారాష్ట్రలో అభివృద్ధి, శాంతిపాలన, నిజమైన ప్రజాస్వామ్య విజయం సాధించామన్నారు. అదే సమయంలో అవాస్తవం, ద్రోహాన్ని ప్రజలు ఘోరంగా ఓటమి పాలు చేశారన్నారు. విభజన వాదాన్ని ఓడించారన్నారు. కుటీల రాజకీయాలను ఓడించారన్నారు. కుటుంబ తత్వ రాజకీయాలు ఓటమి చెందాయన్నారు. వికసిత్​ భారత్​ సంకల్పాన్ని మరింత బలోపేతం చేశారన్నారు. దేశంలోని బీజేపీ, ఎన్డీయే నాయకులు, కార్యకర్తలను  అభినందించారు. 
 
కూటమి నేతలకు ధన్యవాదాలు..
ఏక్​ నాథ్​ షిండే, దేవేంద్ర పడ్నవీస్​, అజిత్​ పవార్​ లకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని ఎన్నో రాష్​ర్టాల ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. మరో ఎంపీ సీటు పెరిగిందన్నారు. యూపీ, ఉత్తరాఖండ్​, రాజస్థాన్​ లో బీజేపీకి పూర్తి బహుమతి లభించిందన్నారు. అసోం ప్రజలు బీజేపీని విశ్వసించారన్నారు. మధ్యప్రదేశ్​ లోనూ సత్ఫలితాలు సాధించామన్నారు. బిహార్​ లోనూ, ఎన్డీయేను ప్రజలు అక్కున చేర్చుకున్నారని ప్రధాని అన్నారు. దీనర్థం దేశంలోని ప్రజలందరూ అభివృద్ధిని, శాంతిని, సుస్థిరతను కోరుకుంటున్నారని స్పష్టం అవుతుందన్నారు. 
 
మూడోసారి ఆశీర్వాదం..
తాను ఝార్ఖండ్​ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా మరింత కష్టపడి పనిచేస్తామని నరేంద్ర మోదీ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్​ అభిప్రాయాలకు అనుగుణంగా తీర్పునిచ్చారని అన్నారు. అంబేద్కర్​, ఫూలే, సావర్కర్​, ఠాక్రే తదితర మహానీయుల ధరిత్రి ఈసారి పాతరికార్డులన్నీ తిరగరాసిందన్నారు. గడిచిన 50యేళ్లలో ఏ పార్టీ, కూటమికి దక్కని విజయం బీజేపీ మహాయుతి కూటమికి దక్కిందన్నారు. ఇది వరుసగా బీజేపీ నేతృత్వంలోని కూటమిని మూడోసారి ఆశీర్వదించారన్నారు. మహారాష్ర్టలోని మూడోసారి పెద్దపార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. ఇది చారిత్రాత్మకమన్నారు. బీజేపీ పనితీరును ప్రజలు స్వాగతించారన్నారు. ఒక్క బీజేపీకే కాంగ్రెస్​ కూటమి పార్టీల కంటే ఎన్నో రెట్ల ఎక్కువ స్థానాలను అందించారని చెప్పారు. దేశం బీజేపీ, ఎన్డీయేనే విశ్వసిస్తోందన్నారు. దేశంలోని ఆరో రాష్ర్టంమన్నారు. వరుసగా బీజేపీకి మూడుసార్లు అధికారం ఇచ్చిందన్నారు. ఇంతకుముందు గోవా, చత్తీస్​ గఢ్​, గుజరాత్, మధ్యప్రదేశ్​, బిహార్​ లో వరుసగా మూడుసార్లు గెలిచామన్నారు. 60 యేళ్ల తరువాత తనకు కూడా ప్రజలు మూడోసారి అవకాశం కల్పించారని ఇది జగమెరిగిన సత్యమన్నారు. తమ అభివృద్ధి, సుస్థిరత విధానంపై ప్రజల విశ్వాసం అన్నారు. వరుసగా మూడోసారి స్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మహారాష్ర్ట ప్రజల సూక్ష్మ ఆలోచనను వివరిస్తుందన్నారు. కొంతమంది కుటీల నీతితో బీజేపీ, కూటమిని అస్థిర పర్చాలని చూశారన్నారు. కానీ మహా ప్రజలు వారిని తిప్పికొట్టారన్నారు. మహారాష్ర్ట దేశానికి ఆర్థిక రాజధాని అన్నారు. ఇక్కడి ప్రజల తీర్పు వికసిత్​ భారత్​ కు సంకల్ప బలమన్నారు. హరియాణా తరువాత మహారాష్ర్ట ఎన్నికల ప్రజలు కూడా ఐక్యతా రాగాన్ని వినిపించారన్నారు. ఒక్కటిగా ఉంటేనే విజయం సాధ్యమని స్పష్టం చేశామన్నారు. ఈరోజు ఐక్యత అనేది దేశ మహామంత్రమన్నారు. 
 
అస్థిరపర్చే కుట్రలను తిప్పికొట్టారు..
రాజ్యాంగం, రిజర్వేషన్లు, ఎస్టీ, ఎస్సీ లను చిన్న చిన్న సమూహాల పేరుతో విభజించాలని కుటీల నీతిని పన్నారని అన్నారు. కానీ వారి కుట్రలను ప్రతీ వర్గం గుర్తించిందన్నారు. ఐక్యతగా ఉండాలన్న మోదీ నిర్ణయాన్ని గౌరవించారన్నారు. జాతి, కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో గొడవలు సృష్టించే వారికి బుద్ధి చెప్పారని అన్నారు. ఆదివాసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు, సమాజంలోని ప్రతీ వర్గం వారు బీజేపీ, ఎన్డీయేకు మద్ధతునిచ్చారని అన్నారు. దీంతో కాంగ్రెస్​ కు సూటిగా ప్రశ్నించారన్నారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఏజెండాను ఇక సహించబోమని ప్రజలు స్పష్టం చేశారన్నారు. అభివృద్ధి, శాంతి, సుస్థిరతలను వెంట తీసుకొని నడుస్తామని ప్రజాస్వామ్య తీర్పుతో స్పష్టమైందన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్​ మన ప్రేరణ అని అణువణువునా మన మనసుల్లో నిలిచారన్నారు. అంబేద్కర్​, పూలే, సావర్కర్​ లాంటి మహానీయుల సామాజిక సూత్రాలను పాటించామని ఇదే మన ఆచారం, మన సంస్కృతి, సాంప్రదాయాలని అన్నారు. 
 
అవకాశం కల్పిస్తే ఏం చేయలేకపోయారు..
కాంగ్రెస్​ కు ఎన్నో యేళ్లుగా మహారాష్ర్ట సేవ కల్పించే అవకాశం ఇచ్చినా వీరు ఏమి చేయలేకపోయారన్నారు. కానీ తాము మరాఠా భాషను సన్మానించామని, గౌరవించామని, మాతృభాషకు గౌరవం తల్లికి గౌరవమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎర్రకోట వేదికగా కూడా ఈ విషయాన్ని పలుమార్లు తెలిపానని మోదీ అన్నారు. 
 
భారత సంస్కృతిని ప్రపంచం గౌరవిస్తోంది..
ఈ రోజు ప్రపంచం భారత సంస్కృతిని సన్మానిస్తుందని, గౌరవిస్తుందని అన్నారు. మహారాష్ర్ట కూడా రాబోయే కాలంలో దేశంతో సమానంగా అభివృద్ధిని సాధిస్తుందన్నారు. కాంగ్రెస్​ కుహానా రాజకీయ నాయకులు భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. దేశ ఓటర్లు అస్థిరతను, శాంతిని భంగం చేసుకోవాలని భావించారని అన్నారు. కుర్చీ కోసం చూసే వారిని ఓటర్లు ఇష్టపడరని అన్నారు. ప్రతీ ఓటరు వేరే రాష్​ర్టంలో అమలవుతున్న సంస్కరణలను కూడా చూస్తారని తెలిపారు. మహారాష్ర్ట ప్రజలు కూడా కర్ణాటక, తెలంగాణ, హిమాచల్​ ప్రజలను కాంగ్రెస్​ ప్రభుత్వం విశ్వాస ఘాతూకాన్ని చూశారన్నారు. ఇలాంటి అవాస్తవ హామీలను చూసే దేశ ఓటర్లు తిప్పికొట్టారని అన్నారు. కాంగ్రెస్​ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినా వారి పాచికలు పారలేదన్నారు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రచారానికి వచ్చినా ఇక్కడి ప్రజలు తిరస్కరించారని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.