చుక్కలంటిన బెంగళూరు దాహార్తి

బెంగళూరులో నీటి సమస్య తీవ్రం ఐటీ ఉద్యోగులకు వర్క్​ఫ్రమ్​ హోం ఒక్క రోజుకు రూ. 500 నీరు సరిపోవడం లేదంటున్న ప్రజలు అపార్ట్​మెంట్​ వాసులకు రేషన్​ పద్ధతి.. ఏ మూలకు సరిపోవడం లేదంటున్న జనాలు ట్యాంకర్​మాఫియాకు ప్రభుత్వం లొంగిపోయిందనే ఆరోపణలు నీటి కొరతపై గత బీజేపీ ప్రభుత్వం ముందుచూపు సీఎం సిద్ధిరామయ్యకు పట్టడం లేదనే ఆరోపణలు

Mar 21, 2024 - 18:48
 0
చుక్కలంటిన బెంగళూరు దాహార్తి

నా తెలంగాణ, సెంట్రల్​డెస్క్: బెంగళూరులో గతంలో ఎన్నడూ లేనంతగా నీటికొరత ఏర్పడింది. తాగునీటి సమస్య ఉద్యోగస్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రజలకు దాహార్తి చుక్కలు చూపిస్తోంది. నీటి క్యాన్లు చేతబట్టి గంటల తరబడి ఆర్​ఓ కేంద్రాల వద్ద జనాలు వేచి ఉంటున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. గురువారం కూడా ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​చేశాయి. నీటితిప్పలపై ఐటీ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుండడంతో సెకండ్లలోనే ప్రపంచవ్యాప్తంగా బెంగళూరు నీటి సమస్య విషయం పాకుతోంది. నీటికొరత నేపథ్యంలో పలు సంస్థలు వర్క్​ఫ్రమ్​ హోం విధానానికి అనుమతినీయడం కొసమెరుపు. వర్క్​ఫ్రమ్​ హోం ఇయ్యడంతో పలువురు ఐటీ ఉద్యోగులు తమ తమ ఇళ్లకు బయలుదేరి పనులు చేసుకుంటున్నారు. మరోవైపు వేలకు వేలు సమర్పిస్తూ బుక్​ చేసుకున్న ట్యాంకర్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. నీరులేక వంటపాత్రలను సైతం కడుక్కోలేకపోతున్నామని భోరుమంటున్నారు. ఇక అపార్ట్​మెంట్లలో నివాసం ఉంటున్న వారి కోసం ప్రభుత్వం తాగునీటి అవసరాలు తీర్చేందుకు రేషన్​ పద్ధతి ద్వారా నీరు అందించడం విశేషం. నీటికోసం రోజుకు రూ. 500 వెచ్చించాల్సి వస్తోందని అయినా నీరు సరిపోవడం లేదని ఉద్యోగులు భోరుమంటున్నారు. 

ఇక, రాజధాని నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పూర్తిగా ‘ట్యాంకర్‌ మాఫీయా’కు లొంగిపోయారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గడువు పూర్తైన ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేక అధిక రేట్లు వసూలు చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. ప్రైవేట్‌ సంస్థల సహకారంతో వార్డుకు ఒకటి చొప్పున సహాయవాణి కేంద్రాలను ప్రారంభించి ప్రజా సమస్యలకు స్పందించాలని విపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, ఐటీ నగరాల్లో బెంగళూరు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఈ సమస్య ఉత్పన్నం కానీయకుండా ముందుచూపుతో వ్యవహరించింది. ప్రాజెక్టుల్లో నీటిమట్టం పెంచేందుకు జాగ్రత్తలు, ఇంకుడు గుంతలు, పక్క రాష్ట్రాలతో సమన్వయంతో ముందుకు వెళ్లడం లాంటి నిర్ణయాలతో నీటికొరత దరిచేరకుండా తీసుకోవడంలో సఫలమైంది. కానీ ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టింది. ఎంతసేపు తమ కుర్చీని ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ప్రజాసంక్షేమాన్ని మరిచిందనే విమర్శలు, ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.