అప్పుల్లో అమెరికా! షట్​ డౌన్​ తప్పదా?

America in debt! Shouldn't it be shut down?

Dec 21, 2024 - 12:50
 0
అప్పుల్లో అమెరికా! షట్​ డౌన్​ తప్పదా?

ప్రభుత్వోగులకు జీతాలందేనా?
అత్యవసరాలకే ప్రాధాన్యమా
51వ సారి షట్​ డౌన్​ ఎన్నిరోజులు?

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ప్రపంచపెద్దన్నగా చెప్పుకుంటున్న అమెరికా ఆర్థిక పరిస్థితులు డోలాయమానంలో ఉన్నాయి. 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేక 51వ సారి షట్​ డౌన్​ విధించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పార్లమెంట్​ లో డోనాల్డ్​ ట్రంప్​ ఆర్థిక బిల్లుకు మద్ధతు లభించకుంటే ఇక షట్​ డౌన్​ తప్పేలా లేదు. బైడెన్​ ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనా డోనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వానికి అతిపెద్ద సవాళ్లను ముందుంచి దిగిపోనుంది. దీంతో మస్క్​ నే నమ్ముకున్న ట్రంప్​ ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దనున్నారో? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న ఆయా దేశాల స్టాక్​ మార్కెట్లపై అమెరికా షట్​ డౌన్​ ప్రకటిస్తే మరింత నష్టాలు తప్పకపోవచ్చు. దీంతో మార్కెట పెట్టబడిదారులు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్టాక్​ మార్కెట్​ లో పెట్టుబడుల ఊపు కొనసాగడం లేదు. 

అమెరికా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా? ప్రభుత్వానికి నిధులు సమకూర్చే బిల్లుకు అమెరికా పార్లమెంట్​ ఆమోదం లభించలేదు. దీంతో ఇప్పటికిప్పుడు అమెరికాకు ఆర్థిక సమస్యలు ఎదురుకాకపోయినా ట్రంప్​ పదవీ బాధ్యతలు చేపట్టాక ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. పార్లమెంట్​ లో డోనాల్డ్​ ట్రంప్​, ఎలాన్​ మస్క్​ ల మద్ధతుతో రిపబ్లికన్​ పార్టీ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టినా ఆమోదం లభించలేదు. మరో విశేషం ఏమిటంటే బిల్లును వ్యతిరేకించిన వారిలో 38 మంది ట్రంప్​ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. 435 ఎంపీల సభలో 290 ఓట్లు అవసరం ఉండగా 174 మంది మద్ధతు మాత్రమే లభించింది. వ్యతిరేకంగా 235 ఓట్లు పోలయ్యాయి. దీంతో డోనాల్డ్​ ట్రంప్​ అధికారంలోకి వచ్చాక తీవ్ర ఇబ్బందులు తప్పనట్లు కనిపిస్తున్నాయి. అందుకే ముందుజాగ్రత్తగా ట్రంప్​ పలు దేశాల పన్నులను పెంచుతానని ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు. అమెరికా అంతర్గత ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి వేరే కారణాల పేరుతో సుంకాలు విధిస్తానని ప్రకటించారు.

అమెరికా ప్రభుత్వ రుణంపై పరిమితి ఉంది. దేశాన్ని నడపడానికి అంతకు మించి అప్పు తీసుకోదు. కొన్నేళ్లుగా ప్రభుత్వం నగదు రహితంగా మారకుండా నిరోధించడానికి ఈ పరిమితిని అనేకసార్లు పెంచారు. ఇందుకోసం అమెరికా పార్లమెంట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు తీసుకురావాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో అమెరికాలో షట్​ డౌన్​ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడి రానున్న ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తప్పదు. షట్​ డౌన్​ తో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఇతర ఖర్చులకు కత్తెర పడుతుంది. అత్యవసర సేవలకు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. గత 50 యేళ్లలో అమెరికాలో 20 షట్​ డౌన్​ లను విధించారు. ట్రంప్​ హయాంలో మూడుసార్లు షట్​ డౌన్​ విధించారు. 2019లో షట్​ డౌన్​ 35 రోజులపాటు కొనసాగింది. దీని కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ రూ. 25 వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. 

అప్పులు..
2001లో రూ. 479 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. 2008 నాటికి రూ. 826 లక్షల కోట్లకు చేరింది. 2017 నాటికి 1,670 లక్షల కోట్లు, 2020 నాటికి 2,224 లక్షల కోట్లు, 2024లో అప్పు కాస్త రూ. 3,061 లక్షల కోట్ల హై మార్కును తాకింది. 

షట్​ డౌన్​ లు..
1995 నవంబర్​, డిసెంబర్​ లలో వరుసగా 5, 21 రోజుల షట్​ డౌన్​ లు విధించారు. 2013లో 16 రోజులు, 2018లో జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్​ 2, 1 రోజు, 35 రోజులపాటు షట్​ డౌన్​ లు విధించారు.