శబరిమల దర్శనానికి పరిమితి విధింపు

దేవస్థానం బోర్డు ప్రకటన

Dec 21, 2024 - 13:05
 0
శబరిమల దర్శనానికి పరిమితి విధింపు

శబరిమల: శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం డిసెంబర్​ 25న భక్తుల దర్శనంలో పరిమితి విధించింది. శనివారం దేవస్థానం బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. డిసెంబర్​ 25, 26, జనవరి 12, 14 తేదీల్లో రోజు వారీ భక్తుల సంఖ్యను రోజుకు 50వేల మందినే అనుమతిస్తామని ప్రకటనలో పేర్కొంది. 25న తంగ అంకి (బంగారు వస్ర్తధారణ) ఉత్సవ ఉరేగింపు రోజు 54వేల మందికి మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. జనవరి 12 నుంచి 15వ తేదీల వరకూ మకర జ్యోతి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే దేవస్థానం బోర్డు ప్రకటన చేసింది. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సామాన్య రోజుల్లో రోజువారి దర్శనాల సంఖ్య 60వేలకు పెంచనున్నారు. 
జనవరి 12 నుంచి 14 వరకు 60 వేల మంది, జనవరి 13న 50 వేలు, మకరజ్యోతి రోజు జనవరి 14న 40 వేల మంది భక్తులను అనుమతించాలని దేవస్థానం బోర్డు నిర్ణయిచింది. ఈ రోజుల్లో స్పాట్ బుకింగ్ సౌకర్యాలను నిలిపివేయాలని భావిస్తున్నారు. శబరిమలకు డిసెంబర్ 19న అత్యధికంగా 96,007 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.