జోషిమఠ్ పేరు మార్పు జ్యోతిర్మఠ్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
Joshimath name change jyotirmath proposal center approval
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ ప్రాంతాన్ని జ్యోతిర్మఠ్ గా పేరు మారుస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేరు మార్పు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్రం ఆమోద ముద్ర వేసినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి చమోలి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. గతంలోనే సీఎం పుష్కర్ సింగ్ ధామి పేరుమార్పు ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించారు. గతేడాది జోషిమఠ్ లో పలుమార్లు భూమి కంపించడం లాంటి ఉపద్రవాలు సంభవించిన విషయం తెలిసిందే.